సినిమా ప్రపంచం
సినిమా రివ్యూలు
గజిబిజి కథతో...రొటీన్ చిత్రం వీడొక్కడే | గజిబిజి కథతో...రొటీన్ చిత్రం వీడొక్కడే |
|
|
తారాగణం: సూర్య, తమన్నా, ప్రభు తదితరులుస సాంకేతికవర్గం: నిర్మాతలు- ఎం.ఎస్. గుహన్, ఎం. శరవణన్, దర్శకత్వం- వి. ఆనంద్. పాయింట్: మారిన సాంకేతిక పరిజ్ఞానంతో కస్టమ్స్ కళ్లుకప్పి వజ్రాలను ఎలా స్మగ్లింగ్ చేయవచ్చనే పాయింట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. కథ: హీరో సూర్య తండ్రి, దాస్ (ప్రభు)లు కలిసి చట్ట విరుద్ధ కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వీరు ఒక్కోసారి హత్యలు కూడా చేయాల్సివస్తుంటుంది. అలాంటి తరుణంలోనే సూర్య తండ్రి ఒకసారి ఘర్షణల్లో భాగంగా మృతి చెందుతాడు. దీంతో ప్రభు ఆ వృత్తిని వదిలిపెట్టి షిప్‌యార్డ్‌లో చెత్త ఎత్తివేసే కాంట్రాక్ట్‌లు, పైరసీ వీడియోల వ్యాపారంలాంటి పనులు మొదలుపెడుతాడు. దీంతోపాటు చనిపోయిన తన స్నేహితుని కుమారుడు సూర్యను చేరదీసిన ప్రభు అతనికి తనవద్దే పని కల్పిస్తాడు. అలాంటి సమయంలో కంప్యూటర్ పరిజ్ఞానం, డిగ్రీ విద్యార్హతలున్నా సూర్య మాత్రం స్మగ్లింగ్‌వైపు దృష్టిసారిస్తాడు. అలా అతను వజ్రాల స్మగ్లింగ్ మొదలుపెడుతాడు. సిటీలో పలుకుబడిగల వ్యాపారవేత్త దాస్ (ప్రభు)తో కలిసి సూర్య ఈ స్మగ్లింగ్ పనులు చేస్తుంటాడు. ఆ క్రమంలో తన గ్రూప్‌లో కొత్తగా చేరిన స్నేహితుడైన ఓ వ్యక్తితో కలిసి సూర్య ఆఫ్రికా దేశానికి వెళ్తాడు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఉగ్రవాద సంస్థల ద్వారా సూర్య వజ్రాలను సంపాదిస్తాడు. | ||||
| (మూలం - వెబ్‌దునియా) | ||||
| < Prev | Next > |
|---|