TeluguNews.Net

    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
               No account yet?
               No account yet?
    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
హొం పేజి arrow ప్రముఖ వార్తలు arrow అ౦తర్జాతీయ౦ arrow పాక్ అణ్వాయుధాలపై బరాక్ ఒబామా ఆందోళన
పాక్ అణ్వాయుధాలపై బరాక్ ఒబామా ఆందోళన Print E-mail
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాకిస్థాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ అణ్వాయుధాలు అమెరికా, భారత్‌లకు ఆందోళన కలిగిస్తున్నాయని బరాక్ ఒబామా పేర్కొన్నారు. అల్ ఖైదా, తాలిబాన్ తీవ్రవాద సంస్థలు ఇటువంటి ఆయుధాలు పొందేందుకు ప్రయత్నిస్తుండటమే తమ ఆందోళనకు కారణమని చెప్పారు.

పాకిస్థాన్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి బుధవారం ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా విడుదలయ్యాయి. పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం 60 నుంచి 100 వరకు అణ్వాయుధాలు ఉండవచ్చని భావిస్తున్నారు.

అయితే వీటి సంఖ్యను పెంచుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలు అణ్వాయుధాలు సమకూర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా అమెరికాను ఆందోళన పరుస్తున్నాయని బరాక్ ఒబామా చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)

< Prev   Next >

Google