ప్రముఖ వార్తలు
అ౦తర్జాతీయ౦
ప్రధాని మన్మోహన్‌కు ఒబామా ప్రశంసలు | ప్రధాని మన్మోహన్‌కు ఒబామా ప్రశంసలు |
|
|
| భారత ప్రధానిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్న మన్మోహన్‌సింగ్‌ను అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రశంసించారు. ప్రధాని మన్మోహన్ గొప్ప ప్రతిభావంతమైన నేత అని ఈ సందర్భంగా ఒబామా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాను త్వరలోనే భారత్‌ను సందర్శించాలనుకుంటున్నట్టు ఒబామా ఈ సందర్భంగా తెలిపారు. అమెరికా భారత రాయబారిగా కొత్తగా నియమితులైన మీరా శంకర్ వైట్‌హౌస్‌లో ఒబామాతో సమావేశమైన సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో భారత రాయబారిగా తనను నియమిస్తూ భారత్ అందించిన ధృవీకరణ పత్రాలను ఒబామాకు అందించేందుకై శంకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొద్దిసేపు జరిగిన ఈ సమావేశంలో భాగంగా ఒబామా మాట్లాడుతూ భారత్‌లో ఇటీవల ముగిసిన ఎన్నికల ప్రక్రియలో విజయం సాధించిన మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని సర్కారుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్‌ను ప్రశంసించడమే కాకుండా త్వరలోనే భారత్‌ను సందర్శించాలనుకుంటున్నట్టు శంకర్ వద్ద తెలిపారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి, ప్రధానులు తెలిపిన శుభాకాంక్షలను ఒబామాకు, మిచ్చెలీకి శంకర్ అందజేశారు. ఇప్పటివరకు అమెరికాలో భారత రాయబారిగా ఉన్న రోనన్ సేన్ పదవీకాలం ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నేపథ్యంలో మీరా శంకర్ ఈ పదవిలో చేరారు. ఈ పదవిని చేపట్టడానికి ముందు ఆమె జర్మనీలో భారత రాయబారిగా పనిచేశారు. | |
| (మూలం - వెబ్‌దునియా) | |
| < Prev | Next > |
|---|