ప్రముఖ వార్తలు
అ౦తర్జాతీయ౦
చర్చల పునరుద్ధరణపై క్లింటన్ ఆశాభావం | చర్చల పునరుద్ధరణపై క్లింటన్ ఆశాభావం |
|
|
| భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య చర్చల పునరుద్ధరణపై అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ బుధవారం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య నిలిపివేసిన శాంతి ప్రక్రియ చర్చలు పునరుద్ధరించబడతాయనే నమ్మకం తనకుందని చెప్పారు. ఈ చర్చలు పునరుద్ధరించబడితే ఈ రెండు అణు రాజ్యాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయని తెలిపారు. 2010 అమెరికా విదేశాంగ విధాన ప్రాధాన్యతలపై ఏర్పాటయిన అమెరికా సెనెట్ విదేశీ సంబంధాల కమిటీకి ఆమె ఈ వివరణ ఇచ్చారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంపై ఆశాభావం వ్యక్తం చేసిన హిల్లరీ క్లింటన్ అమెరికా అందిస్తున్న సాయాన్ని పాకిస్థాన్ అణు సామర్థ్యం పెంచుకునేందుకు ఉపయోగించే వీలు లేదని తెలిపారు. అమెరికా అందిస్తున్న భారీ సాయాన్ని పాకిస్థాన్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగిస్తుందని గత రెండు రోజులుగా అమెరికా మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సెనెటర్ క్రిస్ డాడ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇందుకు అవకాశం లేదని హిల్లరీ క్లింటన్ వివరణ ఇచ్చారు. తాము అందజేస్తున్న సాయం ఉద్దేశించిన ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. | |
| (మూలం - వెబ్‌దునియా) | |
| Next > |
|---|