ప్రముఖ వార్తలు
జాతీయ౦
రాజీవ్‌గాంధీకి నేతల ఘన నివాళి | రాజీవ్‌గాంధీకి నేతల ఘన నివాళి |
|
|
| మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ 18వ వర్థంతి సందర్భంగా పలువురు నేతలు గురువారం ఆయనకు నివాళిని అర్పించారు. రాజీవ్‌కు నివాళి అర్పించినవారిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలు ఉన్నారు. రాజీవ్‌కు నివాళి అర్పించేందుకై న్యూఢిల్లీలోని శక్తిఘాట్ వద్దకు చేరుకున్న నేతలు ఆయనకు నివాళి అర్పించారు. సోనియా, రాహుల్, ప్రియాంకలతో పాటు ప్రధాని మన్మోహన్‌సింగ్, రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌లు కూడా రాజీవ్‌కు అంజలి ఘటించారు. 18ఏళ్ల క్రితం తమిళనాడులోని శ్రీపెరంబదూర్ వద్ద జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా రాజీవ్‌గాంధీని మానవబాంబు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. రాజీవ్‌ను మట్టుబెట్టేందుకు శ్రీలంకలోని తమిళ వేర్పాటువాద సంస్థ అయిన ఎల్టీటీఈ ఈ మానవబాంబును ప్రయోగించింది. | |
| (మూలం - వెబ్‌దునియా) | |
| Next > |
|---|