ప్రముఖ వార్తలు
రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం: ఎర్రన్నాయుడు | రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం: ఎర్రన్నాయుడు |
|
|
| ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల బలాలు సమానంగా ఉందని తెలుగుదేశం సీనియర్ నేత ఎర్రన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడం ఇదే తొలిసారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయమై ఎర్రన్నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించినా ప్రతిపక్ష సభ్యుల సంఖ్య సైతం అధికార పార్టీకి దాదాపు సమానంగా ఉందని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ గురువారం జరగనున్న టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నామని తెలిపారు. అలాగే గురువారం మధ్యాహ్నం జరిగే మరో సమావేశంలో పార్టీ తరపున పార్లమెంటులో అడుగుపెట్టనున్న ఆరుగురు ఎంపీలతో సమీక్ష జరపనున్నట్టు ఆయన పేర్కొన్నారు. | |
| (మూలం - వెబ్‌దునియా) | |
| < Prev | Next > |
|---|
| Ginger Chicken Chicken shreds with mushrooms prepared in Soya - ginger sauce ... | |
| Tandoori Chicken Classic tandoori chicken from India is marinated in yogurt, lemon juice, and plenty of spices, then ... |