TeluguNews.Net

    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
               No account yet?
               No account yet?
    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
హొం పేజి arrow ప్రముఖ వార్తలు arrow అధికారమిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు: వైఎస్
అధికారమిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు: వైఎస్ Print E-mail
రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించిన ప్రజలకు కృతజ్ఞతలని ముఖ్యమంత్రి వైఎస్ తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రమూ ఇవ్వని అత్యంత గొప్ప శక్తిని ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్‌కు అందించారని పేర్కొన్న వైఎస్ మొత్తం 42 లోక్‌సభ స్థానాలకుగాను 33 స్థానాలను అందించినందుకు తాను ఏమిచ్చి రుణం తీర్చుకోగలనంటూ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో లాల్ బహదూర్ స్టేడియంలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వైఎస్ పై విధంగా స్పందించారు. వరుసగా రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంగా ప్రజలనుద్ధేశించి ప్రసంగించిన వైఎస్ ప్రసంగం ఆద్యంతం ప్రజలు తమ ప్రభుత్వానికి మరోసారి అధికారాన్ని కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపే విధంగానే సాగింది.

రాష్ట్ర అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికలు పాలక ప్రభుత్వ నమ్మకానికి, విపక్షాల మోసానికి మధ్య జరిగిన పోరుగా అభివర్ణించిన వైఎస్ ఇందులో ప్రజలు తమ పక్షానే నిలవడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలను మరింతగా ఆకట్టుకునే దిశగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బియ్యం కోటాను పెంచే ఫైలు పైన, ఉచిత కరెంటు సరఫరాను పెంచే ఫైలుపైనా ఆయన తన తొలి సంతకాన్ని చేశారు. దీనిప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న బియ్యం 20 కేజీలనుంచి 30 కేజీలకు పెరగనుండగా, వ్యవసాయానికి ఏడుగంటలపాటు ఇస్తున్న ఉచిత విద్యుత్ ఇకనుంచి తొమ్మిది గంటలపాటు సరఫరా కానుంది.

అటుపై పైఎస్ మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ఏకరువు పెట్టారు. గత ఐదేళ్లలో కొనసాగించిన ఈ సంక్షేమ పథకాలను రానున్న రోజుల్లోనూ అదే విధంగానూ, మరింత నిబద్ధతతోనూ కొనసాగించనున్నట్టు హామీ ఇచ్చారు.
(మూలం - వెబ్‌దునియా)

< Prev   Next >

Google

వ౦టకాలు

Ginger Chicken
Chicken shreds with mushrooms prepared in Soya - ginger sauce ...
Tandoori Chicken
Classic tandoori chicken from India is marinated in yogurt, lemon juice, and plenty of spices, then ...