ప్రముఖ వార్తలు
ప్రా౦తీయ వార్తలు
ఈడీ దరఖాస్తును పరిష్కరించండి: హైకోర్టు | ఈడీ దరఖాస్తును పరిష్కరించండి: హైకోర్టు |
|
|
| సత్యం సంస్థ కేసులో నిందితులైన రామలింగరాజు, రామరాజులను విచారించేందుకు తమకు అనుమతించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెట్టుకున్న దరఖాస్తును పరిష్కరించాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా నాంపల్లి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్‍ను హైకోర్టు ఆదేశించింది. ఈడీ తరపున అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్.వి.రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా జూన్ 1న ఈడీ దరఖాస్తును పరిష్కరించాల్సిందిగా మేజిస్ట్రేట్‌ను ఆదేశించిన కోర్టు ఈ పిటిషన్‌పై విచారణను ముగించింది. మనీలాండరింగ్ చట్టం కింద సత్యం మాజీ ఛైర్మన్ బి. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, సత్యం సంస్థ మాజీ సీఎఫ్ఓ వడ్లమాని శ్రీనివాస్, ఆడిటర్లు తాళ్లూరి శ్రీనివాస్, ఎస్. గోపాలకృష్ణన్‌లపై ఈడీ కేసు నమోదు చేసింది. అయితే నాంపల్లి కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సత్యం నిందితులను విచారించేందుకు ఈడీ ఈ అనుమతి కోరింది. | |
| (మూలం - వెబ్‌దునియా) | |
| < Prev | Next > |
|---|