సినిమా ప్రపంచం
సినిమా కబుర్లు
త్వరలో ప్రేక్షకుల ముందుకు అనకొండ-3 | త్వరలో ప్రేక్షకుల ముందుకు అనకొండ-3 |
|
|
|
హాలీవుడ్‌లో మెగాస్నేక్ పేరుతో నిర్మించబడ్డ చిత్రం త్వరలో అనకొండ-3 పేరుతో తెలుగు ప్రేక్షకులముందుకు రానుంది. కేవలం తెలుగులోనే కాకుండా భారతదేశంలోని అన్ని ప్రధాన భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్రిస్తున్నారు. హాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రాన్ని లక్ష్మీ పాండురంగా ఫిలింగ్ బేనర్‌పై ఉమామహేశ్వరరెడ్డి తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ విషయమై ఉమామహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇంతకుముందు వచ్చిన అన్ని అనకొండ చిత్రాలకంటే ఈ చిత్రం విభిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రం కథ ప్రకారం పాములపై పరిశోధన చేసే ఓ శాస్త్రవేత్త ల్యాబ్‌నుంచి తప్పించుకున్న ఓపాము బయటకు వచ్చాక విపరీతంగా పెరిగి మనుషులపై దాడి చేసే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించబడిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అనకొండ పాముకు, ఇతర పాత్రలకు మధ్య జరిగే సన్నివేశాలు ఉత్కంఠతను కలిగించేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని నెలాఖరులోగా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన వివరించారు. | |
| (మూలం - వెబ్‌దునియా) | |
| < Prev | Next > |
|---|