TeluguNews.Net

    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
               No account yet?
               No account yet?
    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
హొం పేజి arrow సినిమా ప్రపంచం arrow సినిమా కబుర్లు arrow వేసవి వినోదంగా రానున్న అంతిమ పోరాటం
వేసవి వినోదంగా రానున్న అంతిమ పోరాటం Print E-mail
హాలీవుడ్ రైజింగ్ స్టార్స్ జెట్లీ, టాన్స్ పోర్టర్ హీరో జాసన్ స్టాతమ్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న చిత్రం రోగ్ అసాసివ్. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అద్విక ఎంటర్‌ప్రైజెస్ బేనర్‌పై కె. వెంకటరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అంతిమపోరాటం పేరుతో అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను ముగించుకుని ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ప్రింట్లతో విడుదల కానుంది.

ఈ చిత్ర విశేషాలను చిత్ర నిర్మాత కె. వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్న హీరోలతో పూర్తి యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందిందన్నారు. తెలుగు ప్రేక్షకులు సైతం ఇష్టపడే కథానాయకులతో ఈ సినిమా తెరకెక్కిందని నిర్మాత అన్నారు. జెట్లీ, జాసన్ స్టాతమ్‌లు ఈ చిత్రంలో ఒకరికొకరు పోటీపడి నటించారని వెల్లడించారు. వీరిద్దరి మధ్య సాగే యాంటీవార్ ఎంతో అద్భుతంగా ఉంటుందని తెలిపారు.

తన వాళ్ళను చంపిన హంతకులను జెట్లీ వెంటాడి వెంటాడి చంపుతూ ఉంటాడు. జెట్లీని అడ్డుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ట్రాన్స్‌పోర్టర్ హీరో జాసస్ స్టాతమ్ నటించారు. జెట్లీ పట్టుకోవడానికి స్టాతమ్ వెంటాడే సన్నివేశాలు ఎంతో ఆసక్తి కరంగా ఉంటాయని నిర్మాత వివరించారు. సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని ఈ నెల 22న రాష్ట్ర మంతటా అత్యధిక ప్రింట్లతో విడుదల చేస్తున్నామన్నారు.

అద్విక ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై వస్తున్న ఈ చిత్రానికి నిర్మాత- వెంకట రెడ్డి, దర్శకత్వం- ఫిలిప్ జి. అట్‌నెల్.
(మూలం - వెబ్‌దునియా)

< Prev   Next >

Google