TeluguNews.Net

    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
               No account yet?
               No account yet?
    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
జాతీయ౦
ఒరిస్సా సీఎంగా నవీన్ ప్రమాణస్వీకారం Print E-mail
బిజు జనతాదళ్ (బీజేడీ) చీఫ్ నవీన్ పట్నాయక్ గురువారం ఒరిస్సా ముఖ్యమంత్రి తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 103 సీట్లు గెలుచుకొని బీజేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఒరిస్సా అసెంబ్లీలో మొత్తం 147 స్థానాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో దాదాపుగా మూడో వంతు స్థానాలు కైవసం చేసుకొని బీజేడీ అఖండ విజయం సాధించింది.

నవీన్ పట్నాయక్ గవర్నర్ ఎంసీ భండారేను బుధవారం సాయంత్రం కలుసుకున్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరిపారు. అనంతరం గురువారం ఉదయం 11. 30 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకలో నవీన్ పట్నాయక్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమ
ఇ౦కా చదవ౦డి...

 
రాజీవ్‌గాంధీకి నేతల ఘన నివాళి Print E-mail
మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ 18వ వర్థంతి సందర్భంగా పలువురు నేతలు గురువారం ఆయనకు నివాళిని అర్పించారు. రాజీవ్‌కు నివాళి అర్పించినవారిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలు ఉన్నారు.

రాజీవ్‌కు నివాళి అర్పించేందుకై న్యూఢిల్లీలోని శక్తిఘాట్ వద్దకు చేరుకున్న నేతలు ఆయనకు నివాళి అర్పించారు. సోనియా, రాహుల్, ప్రియాంకలతో పాటు ప్రధాని మన్మోహన్‌సింగ్, రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌లు కూడా రాజీవ్‌కు అంజలి ఘటించారు.

18ఏళ్ల క్రితం తమిళనాడులోని శ్రీపెరంబదూర్ వద్ద జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా రాజీవ్‌గాంధీని మానవబాంబు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. రాజీవ్‌ను మట్టుబెట్టేందుకు శ్ర
ఇ౦కా చదవ౦డి...

 
పదవుల కోసం పోరాటం: 22న కొత్త ప్రభుత్వం Print E-mail
కేంద్రంలో కొత్తగా ఏర్పాటుకానున్న యూపీఏ కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గ స్థానాల కోసం దాని భాగస్వామ్య పక్షాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. యూపీఏ భాగస్వామ్య పక్షాల చర్చలు బుధవారం పదవుల చుట్టూనే తిరిగాయి. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

మన్మోహన్ సింగ్ వరుసగా రెండోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. మొత్తం 322 మంది ఎంపీల మద్దతులో ఈసారి ప్రభుత్వం కొలువుతీరబోతుంది. యూపీఏ కూటమికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీల్లో సమాజ్‌వాదీ (ఎస్పీ), ఆర్జేడీ, బీఎస్పీలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరేందుకు బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కులుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రతిభా పాటిల్ నూతన ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్‌ను నియమించారు. దీనికి సంబంధించిన పత్రాన్ని ఆయనకు అందజేశారు. దీంతో తన మంత్రిమండలి సభ్యులతో ప్రధాని మన్మోహన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈసారి కేంద్రంలో ఏర్పాటయ్యే మంత్రివర్గంలో కాంగ్రెస్ నేతలు సింహభాగాన్ని దక్కించుకోనున్నారు. అంతేకాకుండా ప్రధాన మంత్రివర్గ పదవులను కూడా వారి వద్దే ఉంచుకునే అవకాశముంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 200ల
ఇ౦కా చదవ౦డి...

 
ప్రధానిగా మన్మోహన్‌కు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ Print E-mail
దేశ ప్రధానిగా మరోసారి పగ్గాలు చేపట్టేందుకు మన్మోహన్ సింగ్‌కు రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకున్న 274మంది ఎంపీల మద్దతుకు సంబంధించిన పత్రాలను మన్మోహన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలు రాష్ట్రపతికి అందజేశారు.

సోనియా, మన్మోహన్‌లు చూపించిన మద్దతుపై సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రపతి సర్కారు ఏర్పాటు చేయాల్సిందిగా వారిని కోరారు. అదేసమయంలో శుక్రవారం ప్రధానిగా ప్రమాణం చేయాలంటూ మన్మోహన్‌కు రాష్ట్రపతి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన మన్మోహన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

15వ లోక్‌సభలో అతిపెద్ద పార్టీకి, అతిపెద్ద కూటమికి మన్మోహన్ నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్న రాష్ట్రపతి ఆయనను ప్రధానిగా నియమించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. అలాగే మంత్ర
ఇ౦కా చదవ౦డి...

 
సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాల ప్రకటన Print E-mail
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బుధవారం దేశవ్యాప్తంగా మూడు ప్రాంతాలకు చెందిన పన్నెండో తరగతి ఫలితాలు ప్రకటించింది. అజ్మీర్, పంచ్‌కులా, చెన్నై ప్రాంతాల ఫలితాలు వెల్లడించినట్లు సీబీఎస్ఐ తెలిపింది. ఈ మూడు ప్రాంతాల విద్యార్థులు ఇంటర్నెట్‌‍లో తమ ఫలితాలు చూసుకోవచ్చని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఢిల్లీసహా ఇతర ప్రాంతాల ఫలితాలను శుక్రవారం విడుదల చేస్తారు. మార్చిలో జరిగిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు సుమారు 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే సీబీఎస్ఐ పాఠశాలలు తమ విద్యార్థులందరి ఫలితాలు పొందేందుకు పాఠశాల కోడ్, ఇ- మెయిల్ ఐడీల సంబంధిత వెబ్‌సైట్‌లలో రిజిస్టర్ చేయడం ద్వారా పొందవచ్చు.

విద్యార్థులు కూడా వారి ఫలితాలను ఇ- మెయిల్ ఐడీలను రిజిస్టర్ చేసి చూసుకోవచ్చు. ఫలితాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రిజల్ట్స్,ఎన్ఐసీ.ఐఎన్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీబీఎస్ఈరిజల్ట్స్.ఎన్ఐసీ.ఇన్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.స
ఇ౦కా చదవ౦డి...

 
రాష్ట్రపతిని కలుసుకోనున్న సోనియా, మన్మోహన్ Print E-mail
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ బుధవారం తిరిగి ఎన్నికయిన సోనియా గాంధీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలుసుకోనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయిన మన్మోహన్ సింగ్ యూపీఏ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వానికి కూడా నేతృత్వం వహించనున్న సంగతి తెలిసిందే.

కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రధాని మన్మోహన్, సోనియా గాంధీ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రతిభా పాటిల్‌ను కలుసుకోనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతిభా పాటిల్‌ను సోనియా, మన్మోహన్ కోరతారు. యూపీఏ ప్రభుత్వానికి మద్దతుగా ఎంపీలు అందజేసిన లేఖలను ప్రతిభా పాటిల్‌కు అందజేస్తారు.

ఇదిలా ఉంటే బుధవారం ఉదయం సోనియా గాంధీ నివాసంలో యూపీఏ కూటమి పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీలను దూరంగా ఉంచారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం కోసం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి నేతలు ని
ఇ౦కా చదవ౦డి...

 
<< మొదటికి < వెనుకకు 1 2 3 4 5 6 7 8 9 10 తరువాత > చివరకు >>

ఫలితాలు 1 - 6 మొత్త౦ 493

Google