TeluguNews.Net

    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
               No account yet?
               No account yet?
    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
హొం పేజి arrow ప్రముఖ వార్తలు arrow క్రీడా వార్తలు
క్రీడా వార్తలు
ఉత్కంఠభరిత పోరులో చెన్నైదే విజయం Print E-mail
ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయాన్ని సాధించింది. చెన్నై విధించిన 117 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకునే క్రమంలో 92 పరుగులు మాత్రమే చేసిన పంజాబ్ జట్టు తన సెమీస్ అవకాశాలను కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ పార్థీవ్ పటేల్ (32), రైనా (20), ఓరమ్ (17)లు మాత్రమే ఓ మోస్తరు స్కోరు చేయగా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు 9 వికెట్లను నష్టపోయి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ దశలో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన పంజాబ్ జట్టు ప్రారంభంనుంచి మంచి భాగస్వామ్యాలను నమోదు చేయడంలో విఫలమైంది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ జట్టులో పొమెర్స్‌బాచ్ (26), ఇర్ఫాన్ పఠాన్ (14)లు మాత్రమే ఓ మోస్తరుగా ఆడగా మిగిలిన బ్యాట్స్‌మె
ఇ౦కా చదవ౦డి...

 
రాజస్థాన్ రాయల్స్ సెమీస్ ఆశలు గల్లంతు Print E-mail
ఐపీఎల్ టోర్నీలో భాగంగా సెమీస్‌కు చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఢిపెండింగ్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ఓటమి చవిచూసింది. తద్వారా ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలను చేజార్చుకుంది. డర్బన్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడిపోవడం ద్వారా రాజస్థాన్ జట్టుకు ఈ పరిస్థితి దాపురించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు భారీస్కోరు సాధించడంలో విఫలమైంది. తద్వారా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేసింది. బ్యాట్స్‌మెన్ చేసిన అనవసర తప్పిదాలు రాజస్థాన్‌ను వెంటాడాయి. దీనికి తోడు లాంగ్‌వెల్డ్ 3, అగార్కర్ 2 వికెట్లు పడగొట్టడం ద్వారా రాజస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. దీంతో రాజస్థాన్ జట్టు బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.

ఈ నేపథ్యంలో 102 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ సైతం ప్రారంభంలో తడబడింది. అయితే శుక్లా (48 నాటౌట్) జాగ్రత్తగా ఆడి కోల్‌కతాను విజయ తీరాలు చేర్చారు. దీంతో 19.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసిన నైట్‌రైడర్స్ విజయాన్ని అందుకుంది.

ఈ విజయం ద్వారా ఐపీఎల్ రెండో సీజన్‌లో మరో మ్యాచ్ గెలిచామన్న సంతృప్తి తప్ప నైట్‌రైడర్స్‌కు ప్రత్యేకంగా
ఇ౦కా చదవ౦డి...

 
ఐపీఎల్: నైట్‌రైడర్స్ విజయలక్ష్యం 102 Print E-mail
ఐపీఎల్ టోర్నీలో భాగంగా డర్బన్‌లో ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 101 పరుగులు చేసింది. తద్వారా రాజస్థాన్ జట్టు 102 పరుగుల విజయలక్ష్యాన్ని నైట్‌రైడర్స్ జట్టు ముందుంచగలిగింది.

రాజస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలో సూపర్‌గా సాగినా అటుపై కోల్‌కతా బౌలర్స్ విజృంభించడంతో భారీస్కోరు సాధించలేకపోయింది. ముఖ్యంగా లాంగ్‌వెల్డట్ 3, అగార్కర్ 2 వికెట్లు చొప్పున పడగొట్టడంతో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు.

దీంతో ఓపెనర్‌గా బరిలో దిగిన ఓజా చేసిన 22 పర
ఇ౦కా చదవ౦డి...

 
దేశవాళీ ట్వంటీ-20 టోర్నీలో యూసఫ్‌పై వేటు Print E-mail
పాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్‌మెన్ మొహమ్మద్ యూసఫ్ దేశవాళీ ట్వంటీ- 20 టోర్నమెంట్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకోలేకపోయాడు. అతనితోపాటు ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో ఆడిన ఇతర పాక్ ఆటగాళ్లు తమ తమ ప్రాంతీయ జట్లలో చోటు దక్కించుకోవడం గమనార్హం.

పాకిస్థాన్ జాతీయ ట్వంటీ-20 టోర్నమెంట్ సోమవారం లాహోర్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 13 జట్లు తలపడనున్నాయి. ఈ జట్లలో ఎందులోనూ యూసఫ్‌కు చోటు కల్పించలేదు. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో జరగబోతున్న ట్వంటీ- 20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన పాక్ ఆటగాళ్లకు ఈ టోర్నీ ద్వారా ప్రాక్టీసు లభించనుంది.

గత ఏడాది ఐసీఎల్‌లో చేరుకముందు వరకు యూసఫ్‌కు లాహోర్ జట్టు తరపున దేశవాళీ క్రికెట్ ఆడేవాడు. ఈసారి మాత్రం ప్రాంతీయ సెలెక్టర్లు యూసఫ్‌కు మొండిచెయ్యి చూపించడం గమనార్హం. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీఎల్‌తో సంబంధాలు
ఇ౦కా చదవ౦డి...

 
రేపు డెక్కన్- బెంగళూరు రసవత్తర మ్యాచ్ Print E-mail
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో చివరి మ్యాచ్‌లన్నీ రసవత్తరంగా సాగుతున్నాయి. నాలుగైదు జట్లను సెమీస్ చోటు ఊరిస్తుండటంతో అన్ని జట్లు తరువాతి దశకు చేరుకునేందుకు అమీతుమీకు సిద్ధమయ్యాయి. డెక్కన్ ఛార్జర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య గురువారం ఇక్కడ మరో కీలక మ్యాచ్ జరగబోతుంది.

ఈ మ్యాచ్‌లో ఆడుతున్న రెండు జట్లను సెమీస్ చోటు ఊరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా రెండు జట్లకు ఇదే చివరి మ్యాచ్. రెండు జట్ల ఖాతాలోనూ చెరో 14 పాయింట్లు ఉన్నాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలిగింది.

తొలి సీజన్‌లో ఈ రెండు జట్లు చివరి రెండు స్థానాలకు పరిమితమయ్యాయి. అయితే ఈ సీజన్‌లో మాత్రం బాగా పుంజుకున్నాయి. ప్రస్తుతం సెమీస్ చోటు కోసం పోటీ పడుతున్నాయి. రెండో సీజన్‌ను వరుస విజయాలతో ప్రారంభించిన డెక్కన్ ఛార్జర్స్ లీగ్ దశ సగానికి వ
ఇ౦కా చదవ౦డి...

 
అక్తర్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి: పాక్ కోచ్ Print E-mail
త్వరలో జరగబోయే ట్వంటీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడేందుకు ఫిటినెస్ నిరూపించుకోవాలని పాకిస్థాన్ వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌కు ఆ దేశ క్రికెట్ కోచ్ ఇంతిఖాబ్ ఆలం సూచించారు. అక్తర్ గజ్జల్లో గాయం కారణంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్వహించిన కండిషనింగ్ క్యాంపుకు దూరమైన సంగతి తెలిసిందే.

దీనికి దూరమైన కారణంగా ఇంగ్లాండ్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లకు వెళ్లేందుకు అక్తర్ ట్వంటీ- 20 ప్రాక్టీసు మ్యాచ్‌లు, జాతీయ ట్వంటీ- 20 ఛాంపియన్‌షిప్‌లో ఆడాలని పేర్కొన్నారు. అక్తర్ ఫిట్‌నెస్ పరిశీలనలో ఉంది. అందువలన మూడు ప్రాక్టీసు మ్యాచ్‌లు, అనంతరం జరిగే జాతీయ ట్వంటీ- 20 ఛాంపియన్‌షిప్‌ను అక్తర్ ఆడాల్సి ఉంటుందని ఆలం విలేకరులతో చెప్పారు.

ఈ మ్యాచ్‌ల్లో అతని ఆడకపోతే ప్రపంచకప్‌కు వెళ్లేందుకు అతనికి సమస్యలు ఎదురవతాయని తెలిపారు. అక్తర్ కండిషనింగ్ క్యాంపుకు హాజరుకానందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా అసంతృప్తితో ఉంది. ఈ క్యాంపుకు హాజరుకాలేకపోతున్నందుకు అక్తర్ ప్రైవ
ఇ౦కా చదవ౦డి...

 
<< మొదటికి < వెనుకకు 1 2 3 4 5 6 7 8 9 10 తరువాత > చివరకు >>

ఫలితాలు 1 - 6 మొత్త౦ 357

Google