భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య చర్చల పునరుద్ధరణపై అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ బుధవారం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య నిలిపివేసిన శాంతి ప్రక్రియ చర్చలు పునరుద్ధరించబడతాయనే నమ్మకం తనకుందని చెప్పారు. ఈ చర్చలు పునరుద్ధరించబడితే ఈ రెండు అణు రాజ్యాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయని తెలిపారు.
2010 అమెరికా విదేశాంగ విధాన ప్రాధాన్యతలపై ఏర్పాటయిన అమెరికా సెనెట్ విదేశీ సంబంధాల కమిటీకి ఆమె ఈ వివరణ ఇచ్చారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంపై ఆశాభావం వ్యక్తం చేసిన హిల్లరీ క్లింటన్ అమెరికా అందిస్తున్న సాయాన్ని పాకిస్థాన్ అణు సామర్థ్యం పెంచుకునేందుకు ఉపయోగించే వీలు లేదని తెలిపారు.
అమెరికా అందిస్తున్న భారీ సాయాన్ని పాకిస్థాన్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగిస్తుందని గత రెండు రోజులుగా అమెరికా మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సెనెటర్ క్రిస్ డాడ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇందుకు అవకాశం లేదని హిల్లరీ క్లింటన్ వివరణ ఇచ్చారు. తాము అంద |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
భారత ప్రధానిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్న మన్మోహన్‌సింగ్‌ను అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రశంసించారు. ప్రధాని మన్మోహన్ గొప్ప ప్రతిభావంతమైన నేత అని ఈ సందర్భంగా ఒబామా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాను త్వరలోనే భారత్‌ను సందర్శించాలనుకుంటున్నట్టు ఒబామా ఈ సందర్భంగా తెలిపారు.
అమెరికా భారత రాయబారిగా కొత్తగా నియమితులైన మీరా శంకర్ వైట్‌హౌస్‌లో ఒబామాతో సమావేశమైన సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో భారత రాయబారిగా తనను నియమిస్తూ భారత్ అందించిన ధృవీకరణ పత్రాలను ఒబామాకు అందించేందుకై శంకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొద్దిసేపు జరిగిన ఈ సమావేశంలో భాగంగా ఒబామా మాట్లాడుతూ భారత్‌లో ఇటీవల ముగిసిన ఎన్నికల ప్రక్రియలో విజయం సాధించిన మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని సర్కారుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్‌ను ప్రశంసించడమే కాకుండా త్వరలోనే భారత్‌ను సందర్శించాలనుకుంటున్నట్టు శంకర్ వద్ద తెలిపారు.
ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి, ప్రధానులు తెలిపిన శుభాకాంక్షలను ఒబామాకు, మిచ్చెలీకి శంకర్ అందజేశారు. ఇప్పటివరకు అమెరికాలో భారత రాయబారిగా ఉన్న రోనన్ సేన్ పదవీకాలం ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నేపథ్యంలో మీరా శంకర్ ఈ |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాకిస్థాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ అణ్వాయుధాలు అమెరికా, భారత్‌లకు ఆందోళన కలిగిస్తున్నాయని బరాక్ ఒబామా పేర్కొన్నారు. అల్ ఖైదా, తాలిబాన్ తీవ్రవాద సంస్థలు ఇటువంటి ఆయుధాలు పొందేందుకు ప్రయత్నిస్తుండటమే తమ ఆందోళనకు కారణమని చెప్పారు.
పాకిస్థాన్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి బుధవారం ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా విడుదలయ్యాయి. పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం 60 నుంచి 100 వరకు అణ్వాయుధాలు ఉండవచ్చని భావిస్తున్నారు.
అయితే వీటి సంఖ్యను పెంచుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలు అణ్వాయుధాలు సమకూర్చుకునేందుక |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
న్యూయార్క్‌లోని సైనిక స్థావరాలు, యూదుల ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపేందుకు కుట్ర జరిగినట్లు అమెరికా అధికారిక యంత్రాంగం వెల్లడించింది. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
న్యూయార్క్‌లోని బ్రోన్ రివర్‌డాల్ సెక్షన్‌లో ఉన్న ప్రార్థనా మందిరం సమీపంలో బాంబు పేలుళ్లకు జరిగిన కుట్రపై వీరిని అదుపులోకి తీసుకున్నామని అమెరికా అధికారులు తెలిపారు. న్యూబర్గ్‌లోని స్టెవార్ట్ విమానాశ్రయంలో ఉన్న న్యూయార్క్ ఎయిర్ నేషనల్ గార్డ్ స్థావరంలో ఉన్న మిలటరీ విమానాలను క్షిపణితో ధ్వంసం చేసేందుకు కూడా వీరు కుట్రపన్నారని చెప్పారు.
వీరు ఆయుధాలు పొందేందుకు ఫారిన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సమాచారకర్తతో సంబంధాలు పెట్టుకున్నారని, ఎఫ్‌బీఐకి చెందిన ఆ వ్యక్తి నిష్క్రియాత్మకమైన క్షిపణిని, పేలుడు పదార్థాలను కుట్రదారుల గ్రూపుకు అందజేశాడని అధికారులు వెల్లడించారు.
ఈ కుట్రకు సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేసేందుకు గత ఏడాదిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు అరెస్టు చేసిన నలుగురిని జేమ్స్ క్రోమిటీ (అబ్దుల్ రెహమాన్), డేవిడ్ విలియమ్స్ (దావ |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
ఇరాన్ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదీనెజాద్ బుధవారం తమ శాస్త్రవేత్తలు కొత్త మధ్యతరహా క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించారని ప్రకటించారు. ఉపరితలం నుంచి ఉపరితలంమీద లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణి పేరు సెజిల్- 2. ఇరాన్ రక్షణ శాఖ మంత్రి మొహమ్మద్ మొస్తఫా నజ్జార్ తనకు ఈ విషయాన్ని తెలియజేశారని నెజాద్ చెప్పారు.
రెండు దశల్లో నిర్దేశిత లక్ష్యాన్ని తాకే ఈ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని సెమ్నాన్ పట్టణంలో అహ్మదీనెజాద్ వెల్లడించారు. గగనతలంలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఈ క్షిపణి తిరిగివచ్చి లక్ష్యాన్ని ఛేదించిందని నెజాద్ చెప్పడంతో, ఆయన పాల్గొన్న సభలో హర్షధ్వానాలు మోగాయి.
ఈ క్షిపణి ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుందనేది నెజాద్ వెల్లడించలేదు. ఇ |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
పాకిస్థాన్ అణ్వాయుధాలను పెంచుకుంటున్నట్లు బుధవారం వెల్లడైన తాజా ఉపగ్రహ చిత్రాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద 60 నుంచి 100 వరకు అణ్వాయుధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. వీటి సంఖ్యను పెంచుకునే చర్యలు పాకిస్థాన్ చేపట్టినట్లు ఇటీవల కాలంలో మీడియాలో ప్రచారం జోరుందుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా వెల్లడైన ఉపగ్రహ ఛాయాచిత్రాల ప్రకారం.. చిన్న, తేలికపాటి అణ్వాయుధాలను, థర్మో న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేసేందుకు పాకిస్థాన్ ఫ్లూటోనియం ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. తేలికరకం కొత్త అణ్వాయుధాల్లో ఫ్లూటోనియంను న్యూక్లియర్ ట్రిగ్గర్‌గా, శుద్ధి చేసిన యురేనియంను సెకండరీగా ఉపయోగిస్తారని అమెరికాకు చెందిన అమెరికా ఆయుధ నియంత్రణ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
ప్రస్తుతం పాకిస్థాన్ వేగవంతమైన అణ్వాయుధ కార్యక్రమాన్ని చేపట్టిందని, అణ్వాయుధాలు తయారు చేసేందుకు అణు ఇంధనం ఉత్పత్తి కోసం రెండు కేంద్రాలను విస్తరించిందని తాజా ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయని ఇన |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
|
<< మొదటికి < వెనుకకు 1 2 3 4 5 6 7 8 9 10 తరువాత > చివరకు >>
|
| ఫలితాలు 1 - 6 మొత్త౦ 371 |