తెలుగుదేశం శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎంపికయ్యారు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పేరును టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు ప్రతిపాదించారు. దీన్ని మిగిలిన సభ్యులు బలపర్చడంతో కార్యక్రమం పూర్తయ్యింది. రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే అధికారం దక్కకపోయినా బలమైన ప్ |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
జనశక్తి నేత కూర రాజన్న బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాట్లాడుతూ ఉండి ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోవడంతో ఆయనకు గుండెపోటు వచ్చనట్టు అనుమానించారు. అయితే రాజన్నను పరీక్షించిన వైద్యులు అలాంటిదేమీ లేదని నిర్థారించారు.
కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో భాగంగా మాట్లాడుతున్న సమయంలో ఛాతిలో నొప్పి అంటూ రాజన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
రాజన్నను పరీక్షించిన వైద్యులు మెదడుకు రక్తం సరిగా అందని కారణంగానే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని అది గుండెపోటు కాదని తే |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
సత్యం సంస్థ కేసులో నిందితులైన రామలింగరాజు, రామరాజులను విచారించేందుకు తమకు అనుమతించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెట్టుకున్న దరఖాస్తును పరిష్కరించాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా నాంపల్లి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్‍ను హైకోర్టు ఆదేశించింది.
ఈడీ తరపున అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్.వి.రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా జూన్ 1న ఈడీ దరఖాస్తును పరిష్కరించాల్సిందిగా మేజిస్ట్రేట్‌ను ఆదేశించిన కోర్టు ఈ పిటిషన్‌పై విచారణను ముగించింది.
మనీలాండరింగ్ చట్టం కింద సత్యం మాజీ ఛైర్మన్ బి. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, సత్యం సంస్థ మాజీ సీఎఫ్ఓ వడ్లమాని శ్రీనివాస్, ఆడిటర్లు తాళ్లూరి శ్రీనివాస్, ఎస్. గోపాలకృష్ణన్‌లపై ఈడీ కేసు నమోదు చేసింది. అయితే నాంపల్లి కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం జ్యుడీష |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించిన ప్రజలకు కృతజ్ఞతలని ముఖ్యమంత్రి వైఎస్ తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రమూ ఇవ్వని అత్యంత గొప్ప శక్తిని ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్‌కు అందించారని పేర్కొన్న వైఎస్ మొత్తం 42 లోక్‌సభ స్థానాలకుగాను 33 స్థానాలను అందించినందుకు తాను ఏమిచ్చి రుణం తీర్చుకోగలనంటూ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో లాల్ బహదూర్ స్టేడియంలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వైఎస్ పై విధంగా స్పందించారు. వరుసగా రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంగా ప్రజలనుద్ధేశించి ప్రసంగించిన వైఎస్ ప్రసంగం ఆద్యంతం ప్రజలు తమ ప్రభుత్వానికి మరోసారి అధికారాన్ని కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపే విధంగానే సాగింది.
రాష్ట్ర అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికలు పాలక ప్రభుత్వ నమ్మకానికి, విపక్షాల మోసానికి మధ్య జరిగిన పోరుగా అభివర్ణించిన వైఎస్ ఇందులో ప్రజలు తమ పక్షానే నిలవడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలను మరింతగా ఆకట్టుకునే దిశగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బియ్యం కోటాను పెంచే ఫైలు పైన, ఉచిత కరెంటు సరఫరాను పెంచే ఫైలుపైనా ఆయన తన తొలి సంతకాన్ని చేశారు. దీనిప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న బియ్యం 20 కేజీలనుంచి 30 కేజీలకు పెరగనుండగా, వ్యవసాయానికి ఏడుగంటలపాటు ఇస్తున్న ఉచిత విద్యుత్ ఇకనుంచి తొమ్మిది గంటలపాటు సరఫరా కానుంది.
అటుపై పైఎస్ మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ఏకరువు పెట్టారు. గత ఐదేళ్లలో కొనసాగించిన ఈ సంక్షేమ పథకాలను రానున్న రోజుల్లోనూ అదే |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల బలాలు సమానంగా ఉందని తెలుగుదేశం సీనియర్ నేత ఎర్రన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడం ఇదే తొలిసారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ విషయమై ఎర్రన్నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించినా ప్రతిపక్ష సభ్యుల సంఖ్య సైతం అధికార పార్టీకి దాదాపు సమానంగా ఉందని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ గురువారం జరగనున్న టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నామని తెలిపారు.
అలాగే గురువారం మధ్యాహ్నం జరిగే మరో సమావేశంలో పార్టీ తరపున పార్లమె |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
పెళ్లి బృదంతో వెళ్తున్న వాహనం నదిలో పడిపోయిన ఘటనలో 15మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కొందరు మరణించి ఉండవచ్చనే వార్తల నేపథ్యంలో ఆ ప్రాంతంలో విషాధఛాయలు అలుముకున్నాయి.
రాష్ట్రంనుంచి పెళ్లివారితో బయలుదేరిన వాహనం కర్ణాటకలోని మాసపల్లి వద్ద ఉన్న హగరి నదిలో పడిపోయింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్నవారు నదిలో గల్లంతయ్యారు. ఈ దుర్ఘటన గురించి తెలియగానే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
నదిలో గల్లంతైనవారిని వెతికేందుకు గజ ఈతగాళ్లను రంగం |
|
ఇ౦కా చదవ౦డి...
|
|   |
|
<< మొదటికి < వెనుకకు 1 2 3 4 5 6 7 8 9 10 తరువాత > చివరకు >>
|
| ఫలితాలు 1 - 6 మొత్త౦ 592 |